రూ.2 లక్షల పంట రుణాలు మాఫీ చేసి రైతులను ఆదుకోవాలి…..
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ):- మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన కరువు దీక్షలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి. సీపీఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్ అధ్యక్షతన నిర్వహించిన దీక్షలకు సీపీఎం మండల కార్యదర్శి ప్రభాకర్ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా సీపీఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు డి. చిన్నప్ప యాదవ్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో అనంతపురం జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. పంటలు ఎండిపోవడం, బోరుబావులు ఇంకిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని పేర్కొన్నారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు అనంతపురం జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని, రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.అలాగే కరువు ప్రాంత విద్యార్థుల ఫీజులను పూర్తిగా రద్దు చేయాలని, గ్రామాల్లో ఉచిత తాగునీటి సౌకర్యం కల్పించాలని, పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, గ్రామీణ కూలీలకు ఉపాధి హామీ పనులు విస్తృతంగా కల్పించాలని కోరారు. పంట నష్టపరిహారం చెల్లించి పంటల బీమా అమలు చేయడంతో పాటు చిన్న, సన్నకారు రైతులు, కూలీలకు ప్రత్యేక కరువు పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి సాకే సుధాకర్, రైతు సంఘం మండల కార్యదర్శి లలితమ్మ, నాగరాజు, సూరి, పెద్దక్క, నారాయణప్ప, సుందరమ్మ, సీపీఎం నాయకులు ఎర్నాగప్ప, రామాంజినేయులు, రాజశేఖర్, చంద్రమౌళి, మారుతి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


