Homeఆంధ్రప్రదేశ్తుఫాన్ తో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి..

తుఫాన్ తో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి..

- Advertisement -

కృష్ణకుమారి…

విశాలాంధ్ర – డుంబ్రిగుడ : బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తుఫాన్ ప్రభావం ఎక్కువ ఉంటుందని దీంతో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని లోకల్ కంప్లైంట్ చైర్పర్సన్ కె. కృష్ణకుమారి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మూడు రోజులపాటు తుఫాన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వ అధికారులు హెచ్చరికలు జారీ చేశారని చెప్పారు. దీంతో ప్రతి ఒక్కరు తగు చర్యలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రధానంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు చర్యలు తీసుకొని ప్రయాణాలు చేయాలని చెప్పారు. తుఫాను కారణంగా గడ్డవాగులు ఉప్పొంగే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరు కూడా గెడ్డ వాగుల వైపు వెళ్లకుండా ఉండాలని చెప్పారు. పిల్లలకు బయట పంపకుండా ఆయా తల్లితండ్రులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఏది ఏమైనా అల్పపీడనం తగ్గేవరకు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు