Homeజాతీయంఅత్యంతసంపన్నుడిగా అదానీ

అత్యంతసంపన్నుడిగా అదానీ

- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత సంపన్నులుగా గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం నిలిచింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబాన్ని దాటేసి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మేరకు వీ3వీ హురున్ ఇండియా రిచ్ లిస్ట్- 2026 వెల్లడించింది. అదానీ ఆదాయం 13 శాతం పెరిగి రూ.9.23 లక్షల కోట్లకు చేరింది. ముకేశ్ అంబానీ ఆదాయం 10 శాతం తగ్గి రూ.8.63 లక్షల కోట్లుగా నమోదైంది. అంబానీతో పోలిస్తే అదానీ ఆదాయ పరంగా రూ.59,400 కోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆర్సెలర్ మిత్తల్కు చెందిన ఎల్‌ఎన్ మిత్తల్, ఆయన కుటుంబం ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. మిత్తల్ సంపద 93 శాతం పెరిగి రూ.3.39 లక్షల కోట్లకు చేరింది. సంపన్న మహిళలు కూడా పెరిగారు.
గతేడాదితో పోలిస్తే 131 మంది మహిళలు కొత్తగా చోటు సంపాదించారు. వీరిలో రోష్‌ని నాడార్ మల్హోత్రా, ఆమె కుటుంబం రూ.2.79 లక్షల కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో డాలర్ బిలియనీర్ల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు