Homeఆంధ్రప్రదేశ్విశాఖను ముంచెత్తిన భారీ వర్షం.. 24 సెం.మీ. వర్షపాతం

విశాఖను ముంచెత్తిన భారీ వర్షం.. 24 సెం.మీ. వర్షపాతం

- Advertisement -

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కళింగపట్నం వద్ద తీరం దాటింది. దాని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వేకువజాము నుంచి పడుతున్న వర్షాలకు విశాఖపట్నం నగరం జలదిగ్బంధంలో చిక్కుకోగా, రికార్డు స్థాయిలో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ ఎయిర్‌పోర్టు రన్‌వే పరిసరాల్లో 18 సెం.మీ, కాకినాడ, విజయనగరంలో 13 సెం.మీ, కళింగపట్నం, తునిల్లో 5 సెం.మీ మేర వర్షపాతం రికార్డయింది. విశాఖలోని ప్రధాన రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. డ్రైనేజీలు పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వాయుగుండం తీరం దాటినప్పటికీ భూభాగంపై ప్రభావం కొనసాగుతుండటంతో రాగల కొన్ని గంటల్లో ఉత్తరాంధ్రలో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జీవీఎంసీ, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు చేపడుతుండగా, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు