- Advertisement -
ముంబై: విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్యపై నిరసనల వేళ.. మిడ్ సెమిస్టర్ పరీక్షలను ఐఐటీ బాంబే వాయిదా వేసింది. ఈ నెల 26-27 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను అక్టోబరు 10-11కు వాయిదా వేసింది. తమ కుమారుడిని వేధించిన వారిపై చర్యలు కోరుతూ సాహిల్ తల్లిదండ్రులు ముంబైలోని ఆజాద్ మైదాన్లో దీక్ష ప్రారంభించారు. ‘నా బిడ్డను వేధించిన వారిని జైలులో పెట్టాలి. విద్యాసంస్థలో తాను పదేపదే కులవివక్షను ఎదుర్కొన్నట్లు అతడు మాకు చెప్పాడు’ అని సాహిల్ తండ్రి తెలిపారు. అంతకుముందు ‘జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్’ చైర్మన్‌ను కలిసి.. తమ కుమారుడి మరణంపై దర్యాప్తు జరపాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.


