Homeఅంతర్జాతీయంవెనిజులాకు పునర్జన్మ: రోడ్రిగ్స్‌

వెనిజులాకు పునర్జన్మ: రోడ్రిగ్స్‌

- Advertisement -

న్యూయార్క్: తమ దేశం పునర్నిర్మాణం దిశగా సాగుతోందని, పునర్జన్మ పొందుతోందని వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్‌ అన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ దేశాన్ని పునర్నిర్మించడంలో భాగంగా ‘జాతీయ ఆత్మను పునర్నిర్మించడం’ తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతన్నారు. అమెరికాతో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు సిద్ధమని ప్రకటించారు. దేశ పునర్నిర్మాణానికి తమ కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. 2018లో నికోలాస్ మదురో ఐరాస సమావేశానికి హాజరయ్యారు. ఆ తర్వాత వెనిజులా అధినేతగా రోడ్రిగ్స్‌ తొలిసారి అమెరికాలో పర్యటించారు. ‘ముందున్న మార్గం సులభంగా ఉంటుందని హామీ ఇవ్వను. దేశ పునర్నిర్మాణమే మా ప్రాధాన్యత’ అని రోడ్రిగ్స్‌ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు