Homeతెలంగాణ22ఏ భూముల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం

22ఏ భూముల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం

- Advertisement -

ప్రభుత్వం కీలక ఉత్తర్వులు… మధ్యతరగతి, సామాన్య ప్రజలకు ఉపశమనం

విశాలాంధ్ర-హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిన 22ఏ భూములపై సంచలన నిర్ణయం తీసుకుంది. భూ యజమానులకు ఊరటనిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లోని స్థలాలు లేదా ఆస్తులకు సంబంధించి అధికారిక అనుమతులు ఉన్నవారికి రిజిస్ట్రేషన్ల మార్గం సుగమం చేసింది. జీహెచఎంసీ,హెచఎండీఏ, డీటీసీపీ వంటి అధికారిక సంస్థల నుంచి సరైన అనుమతులు ఉన్న భూములకు ఇకపై ఎలాంటి ఆటంకాలు లేకుండా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కేవలం 22ఏ జాబితా కారణంగా రిజిస్ట్రేషన్లు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది మధ్యతరగతి, సామాన్య ప్రజలకు భారీ ఉపశమనం లభించినట్లయింది. కాగా, ప్రతిపక్షం బీఆరఎస్, బాధిత రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైనందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు