-రాకపోకలు నిలిపివేయడంతో తప్పిన పెను ప్రమాదం
విశాలాంధ్ర -విజయవాడ (వన్ టౌన్): విజయవాడలో వరుసగా కురుస్తున్న వర్షాలకు ఇంద్రకీలాద్రి కొండ పూర్తిగా తడిసిపోయింది. ఒక్కసారిగా కొండచరియలు జారిపడ్డాయి. ఘాట్ రోడ్డులోని తొలి మలుపు దాటిన అనంతరం భారీ బండరాళ్లు రోడ్డుపైకి విరిగిపడ్డాయి. పెద్ద శబ్దంతో రాళ్లు జారిపడటంతో స్థానికంగా కొంతసేపు కలకలం నెలకొంది. అయితే ఘాట్‌రోడ్డు మరమ్మతుల కారణంగా ఈ నెల 22 నుంచే అధికారులు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఆ సమయంలో వాహనాలు, భక్తుల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రాళ్లు ఘాట్ రోడ్డుపై పడిన విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమై పరిస్థితిని పరిశీలించారు.


