ఫ్లైదుబాయ్ విమానంలో పైలట్‌పై దాడి చేసి, విమానాన్ని కూల్చివేయాలని ప్రయత్నించిన కో-పైలట్‌కు మరణశిక్ష విధించాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కోరుతోంది. ఈ ఘటనను తీవ్రమైన ఉగ్రవాద చర్యగా అధికారులు అభివర్ణిస్తున్నారు. నిందితుడైన కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీకి అత్యంత కఠిన శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు వాదిస్తున్నారు. గత నెల సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్ 1073 విమానంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లో ఉన్న కో-పైలట్ హమామ్ … విమానంలోని క్రాష్ యాక్స్ (గొడ్డలి) తీసుకుని భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడికి పాల్పడ్డాడు. అనంతరం విమానాన్ని నియంత్రణలోకి తీసుకుని కూల్చివేయాలని ప్రయత్నించడంతో విమానం ఒక్కసారిగా కిందకు దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ చాకచక్యంగా కాక్‌పిట్ డోర్ తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి దూసుకెళ్లి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.ఈ ఘటనపై యూఏఈ అధికారులు విచారణ చేపట్టారు. సౌదీ అరేబియాలో అదుపులోకి తీసుకున్న 29 ఏళ్ల ఒమన్ జాతీయుడైన అల్-హమ్మామీని యూఏఈకి తరలించారు. విచారణలో తాను విమానాన్ని కూల్చివేయాలనే ఉద్దేశంతోనే దాడి చేశానని, చావంటే తనకు భయం లేదని అల్-హమ్మామీ అంగీకరించినట్లు సమాచారం. గతంలో ఒమన్ ఎయిర్ లైన్స్‌లో పనిచేసినప్పుడు కూడా తీవ్రవాద భావజాలం కలిగి ఉన్నాడన్న కారణంతో అతన్ని విధుల నుంచి తొలగించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో యూఏఈకి ఇజ్రాయెల్ అధికారులు కూడా సహకారం అందిస్తున్నారు. విమాన ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించేలా, ఉగ్రవాద దాడికి పాల్పడిన నిందితుడికి అత్యంత కఠిన శిక్ష అయిన మరణశిక్ష విధించాలని యూఏఈ ప్రాసిక్యూటర్లు కోరుతున్నారు.
ఫ్లైదుబాయ్ ఘటన: కో-పైలట్‌కు మరణశిక్ష విధించాలని యూఏఈ పట్టు!
- Advertisement -
RELATED ARTICLES


