రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఃజల్ జీవన్ మిషన్ 2.0 – అమరజీవి జలధారః పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు లాంఛనంగా ప్రారంభించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో రూ. 30,156 కోట్ల భారీ వ్యయంతో ఈ బృహత్తర పథకానికి వారు శ్రీకారం చుట్టారు.ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు కొత్తగా కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా గండికోట రిజర్వాయర్ నుంచి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన సమగ్ర తాగునీటి పథకం పనులను కూడా వారు ప్రారంభించారు.ఈ పనుల ప్రారంభానికి గుర్తుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలిసి మొత్తం 13 శిలాఫలకాలను ఆవిష్కరించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం వారు బహిరంగ సభలో పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ర్యాంపుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కలిసి నడుస్తూ ప్రజలకు అభివాదం చేశారు.
ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ 2.0 పనులు ప్రారంభం
- Advertisement -
RELATED ARTICLES


