Homeఅంతర్జాతీయంయుద్ధంతో తీవ్ర నష్టం

యుద్ధంతో తీవ్ర నష్టం

- Advertisement -

50 శాతం పడిపోయిన రష్యా చమురు శుద్ధి సామర్థ్యం
ఉక్రెయిన్ జీవనాడికి దెబ్బ`లోకోమోటివ్ల కొరత

మాస్కో/కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య గత నాలుగేళ్లుగా యుద్ధం ఉధృతంగా సాగుతోంది. పరస్పర దాడుల క్రమంలో రష్యా చమురు శుద్ధి సామర్థ్యం 50 శాతం ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ తాజాగా వెల్లడించింది. ఫలితంగా ఇంధన ఎగుమతిదారు దేశం స్థాయి నుంచి ఇతర దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితికి రష్యా చేరుకున్నట్లు వ్యాఖ్యానించింది. మాస్కో, యారోస్లావ్ల, ఉస్ట్-లుగా, పెర్ˆ వంటి నగరాల్లోని చమురు శుద్ధి కర్మాగారాలపై ఇటీవల చేసిన దాడుల వల్ల సగానికి పైగా చమురు శుద్ధి సామర్థ్యం దెబ్బతిన్నట్లు పేర్కొంది. రష్యా ఆర్థిక వ్యవస్థకు, దురాక్రమణ సామర్థ్యానికి కోలుకోలేని దెబ్బగా ఉక్రెయిన్ అభివర్ణించింది. ఉక్రెయిన్ దాడులతో రష్యా కీలక చర్యలు తీసుకుంది. దేశీయ మార్కెట్‌కు ఇంధన సరఫరా చేసే చమురు కంపెనీలకు నాలుగేళ్లలో అతిపెద్ద సబ్సిడీ ప్రకటించింది. రష్యా ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం సెప్టెంబరులో సబ్సిడీల మొత్తం 3.6 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు ఉక్రెయిన్ కూడా తమ పౌర విమాన సేవలను పూర్తిగా నిలిపివేసింది. క్షిపణి, డ్రోన్ దాడులు జరిగే అవకాశం ఉండడంతో ప్రజలు బస్సులు, రైళ్లలోనే ప్రయాణిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే నేతలు సైతం రైళ్లలోనే ప్రయాణిస్తారు. దీంతో కీవ్లోని కీలక కర్మాగారాలు, ఓడరేవులు, వంతెనలతో పాటు రైలు సర్వీసులను మాస్కో తరచూ లక్ష్యంగా చేసుకుంటోంది. వందలాది లోకోమోటివ్లు (రైలు ఇంజిన్‌లు) ధ్వంసం చేసింది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉక్రెయిన్ ఇప్పుడు రవాణా సంక్షోభాన్ని ఎదుర్కొవాల్సి వస్తోంది. ఓడరేవులు ధ్వంసమవ్వడం వల్ల సముద్ర వాణిజ్యంపైనా ప్రభావం పడింది. ధాన్యం, ఇనుప ఖనిజం, ఇతర సరకు రవాణాకు రైళ్లు సరిపడ లేకపోవడంతో సరిహద్దుల్లోనే కాకుండా నగరాలలో రైళ్లపై దాడులు చేసేందుకు జెట్-పవర్డ్ డ్రోన్లను రష్యా మోహరిస్తున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. మూడు లోకోమోటివ్లు ధ్వంసమయ్యాయని పోర్ట్ ఆపరేటర్ టీఐఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైకిటా హ్రుబోవ్ పేర్కొన్నారు. ప్రతినెలా డజన్ల కొద్దీ లోకోమోటివ్లను కోల్పోతున్నామని ఉక్రెయిన్ రైల్వే వెల్లడించింది. అదనపు లోకోమోటివ్ ఇంజిన్‌ల కోసం యూరప్ దేశాలతో ఉక్రెయిన్ చర్చిస్తున్నది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు