Homeఅంతర్జాతీయంమా మొర ఆలకించరా?

మా మొర ఆలకించరా?

- Advertisement -

పారిస్: ఫ్రాన్స్‌లో విద్యార్థుల నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, కార్మిక నాయకులు సంయుక్తంగా ఆందోళనలు చేపట్టారు. దీంతో 1,800 హైస్కూళ్లు మూసివేసినట్లు యూనియన్ సిండికేల్ లిసేన్ వెల్లడించింది. దేశంలో 90 శాతం విశ్వవిద్యాలయాý కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడిందని పేర్కొంది. మార్సెయి, నీస్, నాంటెస్, లియోన్, పారిస్ సహా 30కి పైగా పట్టణాలు, నగరాల్లో నిరసనలు జరుగుతున్నట్లు యూనియన్ తెలిపింది. స్రాట్స్బర్గలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నట్లు వెల్లడించింది. లిల్లేలో చెత్త బుట్టలకు నిపðపెట్టడం కూడా ఉద్రిక్తత దారితీసినట్లు అధికారులు తెలిపారు. తాజా నిరసనలో 200,000 వేల మంది పాల్గొన్నట్లు అంచనా వేశారు. పాఠశాలల్లో ప్రభుత్వ నిధులు అరకొరగా ఉండటం, వసతులు లేకపోవడం వంటి సమస్యలు విద్యార్థులను ఆందోళన బాట పట్టించారు. ప్రభుత్వం ఇచ్చే డొల్ల హామీలతో విసిగిపోయామని, వీధుల్లోకి రాక తప్పలేదని విద్యార్థులు వెల్లడించారు. తమపై గొంతు నొక్కేందుకు, బాష్పవాయువు ప్రయోగించి చెదరగొట్టేందుకు ప్రయత్నించడం ఆపేసి, తాము చెబుతున్నది వినాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తు గురించి తలచుకుంటేనే చాలా భయమేస్తోందని విద్యార్థులు వెల్లడించారు. ఉన్నత విద్యలో కొత్త సీట్లు ఏర్పాటు చేయడం, పాఠశాలల పునర్నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించడం, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించడం వంటి డిమాండ్లను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. లేనిపక్షంలో తమ నిరసనలు మరింత విస్తరిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఆందోళనలు కొన్నిచోట్ల హింసాత్మకంగా మారాయి. అనేక స్కూళ్లకు విద్యార్థులు నిపðపెట్టారు. కొందరు టీనేజర్లకు గాయాలయ్యాయి. ఘర్షణల్లో భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు