విశాలాంధ్ర ధర్మవరం; బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన జి. వెంకట్ లక్ష్మి గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలియజేయడంతో ఆయన వారికి హైదరాబాదులో ఉన్న బసవతారకం హాస్పిటల్ లో చికిత్స పొందేలా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 7 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. మాజీ అనంతపురం జిల్లా అధ్యక్షులు సంధిరెడ్డి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు కొనకొండ్లా రాజేష్ , జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి వారి ఇంటికెళ్లి ఆ యొక్క మంజూరు పత్రాన్ని అందజేసి భవిష్యత్తులో సత్య కుమార్ యాదవ్ నుంచి మీకు అన్ని సహాయ సహకారాలు ఉంటాయని వారు తెలిపారు.ఈ సందర్భంగా వెంకటలక్ష్మి వారి కుటుంబం మంత్రి సత్య కుమార్ యాదవ్ కు వారు ధన్యవాదాలు తెలియజేశారు.
క్యాన్సర్ బాధితురాలుకు ముఖ్యమంత్రి సహాయ నిధి
RELATED ARTICLES