Tuesday, February 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమన ధర్మవరం – మన స్వచ్ఛ సంకల్పం

మన ధర్మవరం – మన స్వచ్ఛ సంకల్పం

విశాలాంధ్ర ధర్మవరం;; మన ధర్మవరం – మన స్వచ్ఛ సంకల్పం లోకార్యక్రమంలో భాగంగా నిన్న ఎన్డీఏ కార్యాలయం పక్కన జరిగిన బీజేపీ చేరికల సభ అనంతరం భోజన కార్యక్రమం సందర్భంగా అక్కడ పడి వున్న చెత్తను శుభ్రం చేశారు.మంత్రివర్యులు సత్య కుమార్ సూచన మేరకు,నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు, బీజేపీ నాయకులు కలిసి సభ ప్రాంగణం , భోజన మైదానాన్ని శుభ్రం చేసి పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.సాధారణంగా రాజకీయ సభల అనంతరం స్థలాలు అపరిశుభ్రంగా మారుతాయి కానీ బీజేపీ సిద్ధాంతం భిన్నంగా ఉందని స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇస్తుందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం పరిశుభ్రతపైన ప్రజల్లో మంచి సందేశాన్ని అందించింది.పరిశుభ్ర ధర్మవరం – అభివృద్ధి చెందిన ధర్మవరం లక్ష్యంగా అందరూ కృషి చేయాలి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు జింక చంద్ర శేఖర్,జిల్లా ఉపాధ్యక్షులు సాకే ఓబులేసు ,డోలా రాజా రెడ్డి ,బిల్లే శ్రీనివాస్ ,అంగజాల రాజశేఖర్ ,నభీ రసూల్ ,జూటూరు వెంకటేష్, నాగభూషణ్ , కరుగు మల్లికార్జున, చింతా మంజునాథ, భాస్కర్ రెడ్డి, కుమారు, మహేష్, బండ్లపల్లి రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు