Homeఆంధ్రప్రదేశ్ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

- Advertisement -

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా ఈమేరకు షెడ్యూల్‌ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు ప్రకటించారు.

13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఈ నెల 28న పోలింగ్‌ నిర్వహించనున్నారు. 30న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 18 వరకు గడువు ఇచ్చారు. 19న నామినేషన్లను పరిశీలించనున్నారు. ఉపసంహరణకు ఈ నెల 21వరకు గడువు ఉంది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ..
నవంబరు 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 19న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు తుదిగడువు ఈ నెల 23. ఉపసంహరణకు ఈ నెల 27వరకు గడువు ఉంది. నవంబరు 5న ఫలితాలు వెల్లడించనున్నారు.

మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు..
గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్‌ 26న మొదటి విడత, 29న రెండో విడత, డిసెంబర్‌ 2న మూడో విడత జరగనున్నాయి. ఎన్నికలు జరిగిన రోజునే ఓట్ల లెక్కింపు ఉంటుంది.

తొలి విడత..
నోటిఫికేషన్‌: నవంబరు 13
నామినేషన్ల గడువు: నవంబరు 17
ఉపసంహరణ గడువు: నవంబరు 21
పోలింగ్‌ తేదీ: నవంబరు 26
రెండో విడత..
నోటిఫికేషన్‌: నవంబరు 16
నామినేషన్ల గడువు: నవంబరు 20
ఉపసంహరణ గడువు: నవంబరు 24
పోలింగ్‌ తేదీ: నవంబరు 29
మూడో విడత..
నోటిఫికేషన్‌: నవంబరు 19
నామినేషన్ల గడువు: నవంబరు 23
ఉపసంహరణ గడువు: నవంబరు 27
పోలింగ్‌ తేదీ: డిసెంబరు 2

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు