– ముమ్మిడి దేవీనాగేశ్వరరావు
విశాలాంధ్ర – కడియం : సర్పంచ్గా అవకాశం ఇస్తే తెలుగుదేశం పార్టీ తరపున దుళ్ళ సర్పంచ్గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలుగు యువత నాయకుడు ముమ్మిడి దేవీనాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పార్టీకోసం నిస్వార్ధంగా పనిచేసిన కొందరిలో తానూ ఒకడినని, పార్టీ తరపున అవకాశం ఇస్తే గెలుపునకు తన శాయశక్తులా ప్రయత్నించి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసారు. గత ఎన్నికల్లో పార్టీ విజయం కోసం శ్రమించానన్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి గ్రామంలో మెజార్టీ ఓట్లు సాధించడంలో స్థానిక నాయకులతో కలిసి కృషి చేసానన్నారు. అలాగే గ్రామంలోని అన్ని సామాజిక వర్గాల్లోనూ తనకు మద్దతు ఉందని ఆయన వివరించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ దుళ్ళ గ్రామంలో పటిష్టమైన ఓటుబ్యాంకు ఉందని, వారి మద్దతుతో తాను విజయం సాధిస్తానని దేవీ నాగేశ్వరరావు చెప్పారు.


