విశాలాంధ్ర ధర్మవరం::జాతీయ స్థాయిలో జరిగే ఈ నెల అక్టోబర్ 27 నుండి నవంబర్ 3 వరకు మహారాష్ట్రలోని పూణే నగరంలో జరిగే 41 వ యూత్ నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాలికల, బాలుర బాస్కెట్బాల్ జట్ల ఎంపికకు,అక్టోబర్ 14 తేదీ నుండి 25వ తేదీ వరకు చిత్తూరు నగరంలో జరిగే కోచింగ్ క్యాంపుకు ధర్మవరం పట్టణానికి చెందిన బాలికల విభాగంలో కి ఎం. యశస్విని , బాలర భాగంలో ఎం .కార్తీక్ నాయక్ ఎంపిక కావడం గర్వకారణమని ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అసోసియేట్ సెక్రటరీ శెట్టిపి జయ చంద్రా రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జూలై 9 తేదీ నుండి 12వరకు విజయవాడ నందు జరిగిన నందు జరిగిన అంతర్ జిల్లాల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో వీరు ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించి ప్రతిభా చూపి ఆంధ్రప్రదేశ్ జట్టుకు.. ఎంపిక పట్ల , ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అసోసియేట్ సెక్రటరీ శెట్టిపి జయచంద్రారెడ్డి,ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామి రెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ తుల్లా, హర్షం వ్యక్తం చేశారు.జాతీయ స్థాయిలో వీరు రాణించి ధర్మవరం పట్టణమునకు పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాస్కెట్ బాల్ కోచింగ్ క్యాంప్ జట్లకు ధర్మవరం క్రీడాకారులు ఎంపిక
- Advertisement -
RELATED ARTICLES


