టిపిఓ సాయి ప్రసాదును ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కౌన్సిల్ తీర్మానం
విశాలాంధ్ర ధర్మవరం;; మున్సిపాలిటీలో టిపిఓగా విధులు కొనసాగిస్తున్న సాయి ప్రసాదు పై అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో కౌన్సిల్ సమావేశంలో వారిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కౌన్సిల్లో తీర్మానమును చేయడం జరిగిందని చైర్మన్ కాచర్ల లక్ష్మీ తెలిపారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం చైర్మన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పట్టణంలోని వివిధ సమస్యల పై చర్చించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ సమస్యలపై కౌన్సిలర్లతో చర్చించడం జరిగింది. చర్చ ప్రారంభ దశలోనే టిపిఓ సాయిప్రసాద్ భావన నిర్మాణాల అనుమతుల విషయంలో ప్రజల నుండి లంచాలను తీసుకుంటున్నట్లు ఆధారాలతో సహా వారు రుజువు చేశారు. తదుపరి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పట్టణానికి గతంలో ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని, తదుపరి వారి ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుంటే మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంపై వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. న్యాయం అందరికీ ఒకే రకంగా ఉండాలని చైర్మన్కు విజ్ఞప్తి చేశారు. మరికొందరు కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో మాస్టర్ ప్లాన్ల రోడ్ల వివరాలు ప్రజలకు తెలియక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అదేవిధంగా డివైడర్ల మధ్యలో మొక్కల సంరక్షణను మరిచిపోయారని వారు గుర్తు చేశారు. ఇక పట్టణంలో వీధిలైట్ల కొరత పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని వారు తెలిపారు. మొత్తం మీద మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడి వేడిగా కొనసాగింది. తదుపరి చైర్మన్ లక్ష్మి కౌన్సిల్ సమావేశంలో వచ్చిన సమస్యలన్నింటినీ కూడా తప్పక తీరుస్తానని హామీ ఇస్తూ టి పి ఓ సాయి ప్రసాద్ ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వేముల జయరామిరెడ్డి శంషాద్ బేగం, కో ఆప్షన్ సభ్యులు భూసేట్టి రామకృష్ణ మెప్మా టి పి ఓ విజయభాస్కర్ రాయల్, మున్సిపల్ మేనేజర్, వివిధ విభాగ అధికారులు పాల్గొన్నారు
టౌన్ ప్లానింగ్ విభాగంలో అవకతవకలపై కౌన్సిలర్ల ఆగ్రహం
RELATED ARTICLES