Homeఆంధ్రప్రదేశ్అబ్దుల్ కలాంకు ఘన నివాళి

అబ్దుల్ కలాంకు ఘన నివాళి

- Advertisement -

: స్ఫూర్తి శిఖరమన్న చంద్రబాబు, ఆదర్శమన్న పవన్ కల్యాణ్

భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధికి, సమాజానికి కలాం అందించిన అసమాన సేవలను వారు స్మరించుకున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలాంను ఁస్ఫూర్తి శిఖరంఁగా అభివర్ణించారు. ఆయన ఒక అరుదైన వ్యక్తిత్వమని, భారత అణు, సాంకేతిక రంగాలకు సరికొత్త దిశానిర్దేశం చేసిన దార్శనికుడని కొనియాడారు. కలాం జయంతి సందర్భంగా ఆ మహనీయుడి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ‘ఎక్స్్ణ వేదికగా ఆయన పిలుపునిచ్చారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సందేశంలో.. రామేశ్వరంలోని ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, దేశం గర్వించే శాస్త్రవేత్తగా, ఁప్రజా రాష్ట్రపతిఁగా కలాం ఎదిగిన తీరును కొనియాడారు. ఎస్ఎల్‌వీ-3, అగ్ని, పృథ్వి క్షిపణుల రూపకల్పన, పోఖ్రాన్-2 అణు పరీక్షలు, టెక్నాలజీ విజన్ 2020 వంటి కీలక ఘట్టాలలో ఆయన పోషించిన అద్వితీయ పాత్రను ఈ సందర్భంగా గుర్తుచేశారు. సామాన్య నేపథ్యం ఉన్నత లక్ష్యాల సాధనకు అడ్డంకి కాదని కలాం జీవితం నిరూపిస్తుందన్నారు. శాస్త్రీయ దృక్పథం, స్వయం సమృద్ధి, నిరంతర అభ్యాసం వంటి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన గౌరవమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు