Homeజాతీయంఅంకిత భండారి కేసు: నిరసన తెలుపుతున్న తల్లిదండ్రుల అరెస్ట్, విడుదల

అంకిత భండారి కేసు: నిరసన తెలుపుతున్న తల్లిదండ్రుల అరెస్ట్, విడుదల

- Advertisement -

ఉత్తరాఖండ్‌లో సంచలనం సృష్టించిన అంకిత భండారి హత్య కేసు మరోసారి చర్చనీయాంశమైంది. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిరసన చేపట్టిన అంకిత తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే, కొన్ని గంటల అనంతరం వారిని పోలీసులు విడుదల చేశారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. అంకిత హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దుష్యంత్ గౌతమ్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె తల్లిదండ్రులు బుధవారం ఇండియా గేట్ వద్ద ఆందోళనకు దిగారు. వీరికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున అంకిత తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఉదయం 5 గంటల సమయంలో వారిని విడిచిపెట్టారు. కాగా, వారితో పాటు అదుపులోకి తీసుకున్న కాంగ్రెస్ నేతలు పవన్ ఖేడా, జ్యోతిమణి, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి పోలీస్ స్టేషన్‌లోనే తమ నిరసనను కొనసాగించారు. అంకిత హత్య కేసుతో సంబంధం ఉన్న ఆ ఁవీఐపీఁ దుష్యంత్ గౌతమేనని, ఆయనకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించి సీబీఐ దర్యాప్తును నీరుగార్చేందుకే ప్రభుత్వం గవర్నర్‌గా నియమించిందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, తనపై వస్తున్న ఈ ఆరోపణలను దుష్యంత్ గౌతమ్ తీవ్రంగా ఖండించారు. 2022లో పౌరీ గఢ్వాల్‌కు చెందిన 19 ఏళ్ల అంకిత భండారి, అప్పటి బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యకు చెందిన రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా విధులు నిర్వహించేవారు. అక్కడ వీఐపీ అతిథులకు ఁప్రత్యేక సేవలుఁ అందించాలని ఆమెపై ఒత్తిడి రాగా, అందుకు అంకిత నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే ఆమెను హత్య చేసి చిల్లా కాలువలో పడేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు పడగా, సీబీఐ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు