Homeజాతీయంఎస్‌ఐఆర్‌పై రాహుల్‌ గాంధీ పిటిషన్‌.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఎస్‌ఐఆర్‌పై రాహుల్‌ గాంధీ పిటిషన్‌.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

- Advertisement -

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)లో భారీగా ఓట్ల తొలగింపు, అక్రమాలు జరిగాయంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఎస్ఐఆర్ వ్యవహారంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలు ఇటీవల సుప్రీంకోర్టుకు ర్యాలీగా వెళ్లి ఉమ్మడి పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో జరిగిన ఓట్ల తొలగింపులు, మార్పులపై స్వతంత్రంగా ఆడిట్‌ నిర్వహించాలని ప్రతిపక్ష నేతలు కోరారు. ఇందుకోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో సాంకేతిక నిపుణులు, ప్రముఖ పౌరులతో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఓటరునైనా ముందస్తు నోటీసు ఇవ్వకుండా, తన వాదన వినిపించే అవకాశం కల్పించకుండా ఓటర్ల జాబితా నుంచి తొలగించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పంజాబ్‌తో పాటు ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాల్లో అర్హులైన ఓటర్లు చట్టం అనుమతించిన చివరి తేదీ వరకు తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. పిటిషన్‌పై తుది నిర్ణయం వెలువడే వరకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలని కూడా అభ్యర్థించారు.రాహుల్‌ గాంధీతో పాటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అఖిలేశ్‌ యాదవ్‌, తేజస్వీ ప్రసాద్‌ యాదవ్‌, సౌగతా రాయ్‌, సుప్రియా సూలే, సంజయ్‌ రౌత్‌, డి.రాజా తదితరులు ఈ పిటిషన్‌లో సహ పిటిషనర్లుగా ఉన్నారు.

మరోవైపు, జంతర్‌ మంతర్‌ను నిరసన ప్రదేశంగా గుర్తించిన హోదాను తొలగించడాన్ని సవాలు చేస్తూ స్వాతి సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పైనా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రాంగణంతో పాటు సంబంధిత ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను భద్రపరచాలని ఆదేశించింది. అక్టోబర్‌ 10న ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల నేపథ్యంలో నిరసనలు, మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రాకపోకలకు అంతరాయాలపై దాఖలైన ఇతర పిటిషన్లను కూడా ధర్మాసనం విచారించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు