Homeతెలంగాణఅర్హులైన వారంద‌రికి డ‌బుల్ బెడ్ రూం ఇవ్వాలి : సునీత రాముయాద‌వ్‌

అర్హులైన వారంద‌రికి డ‌బుల్ బెడ్ రూం ఇవ్వాలి : సునీత రాముయాద‌వ్‌

- Advertisement -

విశాలాంధ్ర‌, మ‌ల్కాజిగిరి : అర్హులైన అందరికీ డబల్ బెడ్ రూములు మంజూరు చేయాలని కోరుతూ మల్కాజిగిరి గౌతమ్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ఆధ్వర్యంలో గురువారం మల్కాజిగిరి జోనల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జోన‌ల్ కమిషనర్ అందుబాటు లేకపోవడంతో ఏఎంసి శాంతి ప్రియకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మేకల సునీత రామ్ యాదవ్ మాట్లాడుతూ… ఇండ్లు లేక ఎంతో మంది నిరుపేదలు అల్లాడుతున్నారని, అర్హులైన వాళ్లందరి దరఖాస్తులను పరిశీలించి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గూడులేని ప్ర‌తి ఒక్క‌రికి గూడు క‌ల్పించే విధంగా అధికారులు కృషి చేయాల్సి ఉండ‌గా వారు సైతం అర్హుల‌ను ప‌క్క‌న పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికైన అర్హుల‌కు అధిక ప్రాధాన్య‌ను ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు మేకల రామ్ యాదవ్, సిద్ధి రాములు, శంకర్, రాజా,సుధాకర్, అశోక్, ఏపీ ప్రసాద్, విగ్నేష్, యాదగిరి, బాల్ రాజ్, మహిళా నాయకురాలు అనిత, లక్ష్మి, లలిత, సరిత తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు