Homeఆంధ్రప్రదేశ్ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన

ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం.. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.అదేవిధంగా శ్రీకాకుళం, పోలవరం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది.వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు