Homeతెలంగాణగడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ లో హమాలి చార్జీల పెంచాలి : ఏఐటియు సి

గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ లో హమాలి చార్జీల పెంచాలి : ఏఐటియు సి

- Advertisement -

విశాలాంధ్ర- అబ్దుల్లాపూర్ మెట్: గడ్డి అన్నారం, బాటసింగారంలోని ఫ్రూట్ మార్కెట్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో మార్కెట్ ఎస్ జి ఎస్ కార్యదర్శి శ్రీనివాస్ వినతి పత్రం అందజేయడం జరిగింది.ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అన్ లోడింగ్ చార్జీలు సవరించడం ఆనవాయితీగా వస్తుందని, ప్రస్తుతం పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా హమాలీ కార్మికుల అన్ లోడింగ్ చార్జీలు తక్షణమే పెంచాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు కేతరాజు నరసింహ, ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దాసరి ప్రసాద్, ఫ్రూట్ మార్కెట్ హమాలీ వర్కర్ యూనియన్ అధ్యక్షులు ఎండి షరీఫ్, ప్రధాన కార్యదర్శి కోయకూర చిన్న గౌడ్, కోశాధికారి మేతరి పోచయ్య, ఉపాధ్యక్షులు ఎండి షరీఫ్, రాజు నాయక్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు