Homeతెలంగాణవెంగళరావు కమాన్ వద్ద ఆపరేషన్ కవచ్‌

వెంగళరావు కమాన్ వద్ద ఆపరేషన్ కవచ్‌

- Advertisement -

309 వాహనాల తనిఖీ.. 36 ద్విచక్ర, త్రిచక్ర వాహనాల స్వాధీనం

విశాలాంధ్ర, జూబ్లీహిల్స్ : మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగళరావు కమాన్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 1 నుంచి 3 గంటల వరకు పోలీసులు ఆపరేషన్ కవచ్‌ నిర్వహించారు. మధురానగర్ పోలీసులతో పాటు ఏఆర్‌, టీఎస్‌ఎస్‌పీ, బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులకు చెందిన మొత్తం 32 మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మొత్తం 309 వాహనాలను తనిఖీ చేశారు. వీటిలో 209 ద్విచక్ర వాహనాలు, 50 త్రిచక్ర వాహనాలు, 30 నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 35 ద్విచక్ర వాహనాలు, ఒక త్రిచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీడీ కేసులకు సంబంధం ఉన్న ఐదు ద్విచక్ర వాహనాలను బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులకు అప్పగించారు.
జూబ్లీహిల్స్ జోన్ డీసీపీ, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య ఐపీఎస్, అదనపు డీసీపీ, బంజారాహిల్స్ ఏసీపీ, జూబ్లీహిల్స్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్, నార్కోటిక్స్ ఇన్‌స్పెక్టర్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ తమ సిబ్బందితో కలిసి తనిఖీ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు