Homeతెలంగాణబ‌తుక‌మ్మ పండుగ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక ః క్యానం రాజ్య ల‌క్ష్మి

బ‌తుక‌మ్మ పండుగ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక ః క్యానం రాజ్య ల‌క్ష్మి

- Advertisement -

విశాలాంధ్ర‌ – మ‌ల్కాజిగిరి : గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి మహిళా సంఘం ఆధ్వర్యములో నారాయణగూడలోని వారి భవనములో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో వినాయ‌క్ న‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పోరేట‌ర్ క్యానం రాజ్య‌ల‌క్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్శంగా ఆమె మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వ‌హించుకోవ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటి చెప్పారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ బతుకమ్మ పాటలు, మహిళల సందడి, సమష్టి భాగస్వామ్యంతో చేపట్టిన ఉత్సవ వేడుకలు పండుగ శోభను సంతరించుకుంది. పాటలు పాడుతూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో పద్మశాలి మహిళా సంఘం స‌భ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు