Monday, February 3, 2025
Homeజాతీయంముంబయి ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం

ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం

కస్టమ్స్ అధికారులు ఇటీవల జరిపిన తనిఖీల్లో 16.49 కోట్ల విలువైన 1700 గ్రాముల కొకైన్‌ను పట్టుకున్నారు. వినూత్న పద్ధతుల్లో కేటుగాళ్లు డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం సినీ పక్కీని తలపిస్తోంది. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇటీవల భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఒక కేటుగాడు డ్రగ్స్‌ను క్యాప్య్సూల్స్ రూపంలో పొట్టలో ఉంచుకుని అక్రమ రవాణాకు సిద్ధమైనట్లు అధికారులు గుర్తించారు. ముంబయి ఎయిర్ పోర్టులో గ్రీన్ ఛానల్ ద్వారా వెళ్లేందుకు ఈ కేటుగాడు యత్నించాడు. అతని ట్రావెల్ హిస్టరీ ఆధారంగా కస్టమ్స్ అధికారులు అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించిన అధికారులు ఆసుపత్రికి తరలించి వైద్యుల సహాయంతో శస్త్రచికిత్స ద్వారా పొట్టలో దాచిన డ్రగ్స్ ను వెలికి తీశారు. అయితే ఎక్కువగా విదేశీయులే ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. కస్టమ్స్ అధికారులు అతనిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు