Homeక్రీడలుఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు శుభారంభం

ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు శుభారంభం

- Advertisement -

జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. పోటీల తొలిరోజైన సోమవారం, భారత పారా షూటర్లు పతకాల వేట ప్రారంభించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్‌1 విభాగంలో భారత క్రీడాకారిణులు మోనా అగర్వాల్ స్వర్ణం, అవనీ లేఖరా రజతం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఈ గేమ్స్‌లో భారత్‌కు ఇవే తొలి పతకాలు కావడం విశేషం.హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో మోనా అగర్వాల్ 250.0 పాయింట్లతో ఆసియా పారా గేమ్స్ రికార్డు సృష్టించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. కేవలం 0.4 పాయింట్ల స్వల్ప తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ అవనీ లేఖరా వెనుకబడింది. అవనీ 249.6 పాయింట్లతో రజత పతకంతో సరిపెట్టుకుంది. దక్షిణ కొరియాకు చెందిన లీ యున్రి 227.9 పాయింట్లతో కాంస్య పతకం గెలుచుకుంది.అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో కూడా భారత షూటర్లే ఆధిపత్యం ప్రదర్శించారు. మోనా అగర్వాల్ 629.1 పాయింట్లతో గేమ్స్ రికార్డు నెలకొల్పి అగ్రస్థానంలో నిలవగా, అవనీ లేఖరా 626.4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. తొలిరోజే రెండు పతకాలతో భారత్ ఈ మెగా ఈవెంట్‌లో తన ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు