Monday, February 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా 20వ ఉపాధి హామీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం..

ఘనంగా 20వ ఉపాధి హామీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం..

ఏపీఓ అనిల్ కుమార్ రెడ్డి.
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం విభాగం సిబ్బంది ఆధ్వర్యంలో 20వ ఉపాధి హామీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏపీఓ అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పథకాన్ని ఫిబ్రవరి 2వ తేదీ 2006 వ సంవత్సరం నార్పల మండలం బండ్లపల్లి గ్రామం నందు మన్మోహన్ సింగ్ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి గ్రామీణ కూలీల స్థితిగతులను మార్చుట కోసం కేంద్ర ప్రభుత్వం 20వ ఉపాధి హామీ చట్టం ద్వారా ఈ పథకాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. ఆనాటి కూలీ రేటు 80 రూపాయల నుండి నేడు 300 రూపాయల వరకు చేరిందని, పథకం అమలులో కూడా సాంకేతికను వినియోగించడం ద్వారా సత్ఫలితాలను సాధించడమే కాకుండా పారదర్శకతను కూడా పాటించడం, పనుల కల్పనలో కూడా సహజ వనరుల అభివృద్ధితో పాటు పేద రైతులకు పండ్లతోటల పెంపకం, భూ అభివృద్ధి పనులు, పాడి పెంపకం కోసం గోకులం నిర్మాణములో పశు గడ్డి క్షేత్రాలు ,మల్బరీ షేడ్స్ ,మల్బరీ పెంపకం వంటి పనులు కూడా సమర్థవంతంగా చేపట్టడం జరుగుతోందని తెలిపారు. అంగన్వాడి కేంద్రాల నిర్వహణ, సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టి మౌలిక వసతులు కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో కూడా అగ్రస్థానంలో ఉపాధి హామీ ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఏలు చంద్రకళ ,భారతి, ఎఫ్ఏ లు జయకృష్ణ, సదాశివ, రామ్మోహన్ ,చంద్రశేఖర్, విశ్వనాథ్, అశోక్ కుమార్,చంద్రశేఖర్, పురుషోత్తం, శ్రీనివాసులు, చౌదరి, సివోలు లక్ష్మి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు