Monday, February 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా కాకతీయ విద్యా నికేతన్ పాఠశాల 15వ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా కాకతీయ విద్యా నికేతన్ పాఠశాల 15వ వార్షికోత్సవ వేడుకలు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాకతీయ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 15వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా యాజమాన్యం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు, టూ టౌన్ సీఐ రెడ్డప్ప, ఎంఈఓ లు రాజేశ్వరి గోపాల్ నాయక్, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సేట్టిపి జయ చంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు నైతిక విలువలు పెంపొందించుకోవాలని, అన్ని రంగాలలో రాణించాలని, విద్యార్థి దశ నుండి సామాజిక స్పృహ లక్ష్యాలను అలవర్చుకోవాలని, ఇతరులకు సహాయపడే గుణమును పెంపొందించుకోవాలని తెలిపారు. విద్యార్థులు ఇష్టపడి కష్టపడి చదివినప్పుడే భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని తెలిపారు. గత సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో టౌన్ ఫస్ట్ వచ్చిన నిత్యశ్రీని వారు ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు సెల్ఫోన్ వినియోగమును పూర్తిగా తగ్గించుకొని టెక్నాలజీ తో విద్యార్థుల ఎదుగుదల కావాలని తెలిపారు. తదుపరి వివిధ అంశాలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు సెట్టిపి రామిరెడ్డి, చిన్న కిష్టమ్మ, కరెస్పాండెంట్ నిర్మలాదేవి, డైరెక్టర్స్ సూర్యప్రకాశ్ రెడ్డి, పద్మ, తల్లిదండ్రులు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు