Monday, February 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద ప్రజలందరికీ కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము యువర్స్ ఫౌండేషన్..

పేద ప్రజలందరికీ కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము యువర్స్ ఫౌండేషన్..

అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం

విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలందరికీ కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని యూవర్స్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం ,కోశాధికారి వంకదారి మోహన్, క్యాంపు చైర్మన్ పోలా ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు, క్యాంపు చైర్మన్లు మాట్లాడుతూ ఈ కంటి వైద్య శిబిరం యువర్స్ ఫౌండేషన్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ -శ్రీ సత్య సాయి జిల్లా, నేత్ర జ్యోతి కంటి ఆసుపత్రి-బెంగళూరు (బెంగళూరు వెస్ట్ లయన్స్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి) సంయుక్తంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. గత 30 సంవత్సరాల నుండి ధర్మవరం పరిసర ప్రాంతాల ప్రజలకు, వేల మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించి, కంటి చూపులు ప్రసాదించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా బెంగళూరు ఆసుపత్రి వైద్యులచే కంటి శుక్లములు ఉన్నవారిని పరీక్షించి ఉచితంగా ఐఓఎల్ ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కంటి ఆపరేషన్లకు ఎంపికైన వారిని బెంగళూరుకు ప్రత్యేక బస్సు నందు తీసుకొని వెళ్లి ఉచితముగా కంటినందు లెన్స్ అమర్చి ఆపరేషన్లు చేసి తిరిగి ప్రత్యేక బస్సులో ధర్మవరము లో చేర్చడం జరుగుతుందని తెలిపారు. బిపి, షుగర్, గుండె జబ్బులు ఉన్నవారికి పరీక్షించి, శరీర అనుకూలం ఉన్నవారికి కూడా ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరంలో 96 మంది కంటి రోగులు పాల్గొనగా, అందరికీ బెంగళూరు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అంజనా, డాక్టర్ అయాసే కంటి వైద్య పరీక్షలు తర్వాత 46 మందిని ఆపరేషన్కు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ నేత్రదానం కూడా చేస్తూ ఇరువురికి కంటి వెలుగును ప్రసాదించాలని తెలిపారు. మా యువర్స్ ఫౌండేషన్ సంస్థ చేస్తున్న ఈ శిబిరాల సమాచారాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా వచ్చిన వారు తెలియజేయాలని తెలిపారు. అనంతరం కంటిపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను డాక్టర్లు కంటి రోగులకు వివరించారు. అనంతరం కంటి రోగులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు కాచర్ల హనుమంతు జ్ఞాపకార్థం కుమారుడు కాచర్ల నాగరాజు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఘనంగా శిబిరములో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నామాల శ్రీనివాసులు, పెనుజురి నాగరాజు, నాగార్జున చాంద్ బాషా, సత్రశాల మల్లికార్జున, గర్రె రమేష్ బాబు, ఓ వి. ప్రసాద్, సికిందర్, సుంకుసుకుమార్, సి కె. రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు