- Advertisement -
విశాలాంధ్ర – గుడిబండ: గుడిబండ మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి లక్కమ్మ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలను నేరుగా కలుసుకుని తనకు మద్దతు తెలిపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.ప్రజల మద్దతుతో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా స్థానికులను కలుసుకుంటూ తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఈడిగ మంజునాథ్, యువరాజ్, నటరాజు, పెట్రోల్ బంక్ తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.


