హాజరుకానున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర-అనంతపురం : హంద్రీ నీవా లైనింగ్ పనులు ఆపి ఆయకట్టుకు నీరు అందించాలనే ఫిబ్రవరి 4వ తేదీన హంద్రీ నీవా కార్యాలయం వద్ద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డిజగదీష్, ఇతర వామపక్ష పార్టీలు నాయకులతో పెద్దఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ తెలిపారు.. సోమవారం సిపిఐ పార్టీ ప్రధాన కార్యాల యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాఫర్ మాట్లాడుతూ… రాయలసీమ జిల్లాకు వరప్రసాది హంద్రీనీవా పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. వర్షాభావం వల్ల ఇక్కడి రైతులు వేరే ప్రాంతాలకు వలస పోతున్నారని, వలసల అడ్డుకట్టకు సాగునీరు సమృద్ధిగా ఇవ్వాలన్నారు. ప్రస్తుతం 30 లక్షల మందికి తాగునీరు ఇవ్వడానికి, మూడు లక్షల 45 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే పథకం నత్తనడక నడుస్తోంది అన్నారు. కాలువ వెడల్పు చేయకుండా పదివేల క్యూసెక్కుల నీరు ఏ విధంగా అందిస్తారని ప్రశ్నించారు. మల్యాల నుంచి 12 పంప్ సెట్లకు కాను పంప్ సెట్లు పనిచేస్తోందన్నారు. వెంటనే లైనింగ్ పనులు ఆపి ఆయకట్టు ద్వారా క్షణమే పిల్ల కాలవలు తవ్వి నీరందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హంద్రీనీవా కార్యాలయం వద్ద చేపడుతున్న ధర్నాలో సిపిఐ , వామపక్ష నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు పి. నారాయణస్వామి, సి. మల్లికార్జున,, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి.కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లైనింగ్ పనులు ఆపాలని హంద్రీనీవా కార్యాలయం వద్ద ధర్నా
RELATED ARTICLES