Monday, February 3, 2025
Homeవ్యాపారంతస్వ ఎక్స్‌ తరుణ్‌ తహిలియాని వెడ్డింగ్‌ కలెక్షన్‌

తస్వ ఎక్స్‌ తరుణ్‌ తహిలియాని వెడ్డింగ్‌ కలెక్షన్‌

బెంగళూరు : ప్రీమియం సంప్రదాయ మెన్స్‌ వేర్‌ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది తస్వ. ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ రిటైల్‌ లిమిటెడ్‌కు చెందిన తస్వ ఇప్పుడు ప్రఖ్యాత డిజైనర్‌ తరుణ్‌ తహిలియాని సహకారంతో బెంగళూరుతో ఒక ఎక్స్‌ క్లూజివ్‌ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనలో ప్రధానంగా 2025లో హైలెట్‌ కాబోయే గ్రాండ్‌ వెడ్డింగ్‌ కలెక్షన్‌ను ఆవిష్కరించింది. మరోవైపు రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రదర్శనలు దక్షిణ భారతదేశం అంతటా లాంచ్‌ చేసేందుకు ఇది నాంది పలికింది. అన్నింటికి మించి వారసత్వం, ఆధునికత పట్ల ఈ ప్రాంత లోతైన ప్రశంసలను ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం ఉన్న అద్భుతమైన మెన్స్‌ వేర్‌ని తరుణ్‌ తహిలియాని తనదైన ప్రసిద్ధ కళాత్మకతతో సమ్మిళితం చేశారు. ఈ సాయంత్రం మాస్టర్‌ చెఫ్‌ హరీష్‌ క్లోజ్‌పెట్‌, రిడా తారా, షైనేష్‌ శెట్టి, కార్తీ మహేష్‌ వంటి ప్రముఖ వ్యక్తులు ర్యాంప్‌పై నడిచి కలెక్షన్‌ను ప్రదర్శించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు