Monday, February 3, 2025
Homeవ్యాపారంసామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌25 సిరీస్‌ ప్రీ-బుకింగ్స్‌ ప్రారంభం

సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌25 సిరీస్‌ ప్రీ-బుకింగ్స్‌ ప్రారంభం

గుర్గావ్‌: భారతదేశంలోని ప్రముఖ వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ అయిన సామ్‌సంగ్‌ తాజా గెలాక్సీ ఎస్‌ 25 అల్ట్రా, గెలాక్సీ ఎస్‌25G మరియు గెలాక్సీ ఎస్‌ 25 స్మార్ట్‌ఫోన్‌లతో కూడిన గెలాక్సీ ఎస్‌25 సిరీస్‌ను అధికారికంగా విడుదల చేసింది. వినియోగదారు అనుభవాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తూ, కొత్త గెలాక్సీ సిరీస్‌ కార్నింగ్‌ౖ గొరిల్లాౖ ఆర్మర్‌ 2ను పరిచయం చేస్తుంది. ఇది పరిశ్రమ మొట్టమొదటి యాంటీ-రిఫ్లెక్టివ్‌ గ్లాస్‌ సిరామిక్‌, అసాధారణమైన స్క్రాచ్‌ రెసిస్టెన్స్‌, మెరుగైన డిస్‌ప్లే స్పష్టతను అందిస్తుంది. ఈ సిరీస్‌ భారతదేశంలో ప్రీ-ఆర్డర్‌ కోసం అందుబాటులో ఉంది, ధరలు గెలాక్సీ ఎస్‌25 రూ.80999, గెలాక్సీ ఎస్‌25G రూ.99999, గెలాక్సీ ఎస్‌25 అల్ట్రా రూ.129999 నుండి ప్రారంభమవుతాయి. గొరిల్లా ఆర్మర్‌ 2 అనేది గ్లాస్‌ సిరామిక్‌ టెక్నాలజీలో ఒక మైలురాయి విజయం, ఇది స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లేలో అత్యుత్తమ దృఢత్వాన్ని అద్భుతమైన స్పష్టతతో మిళితం చేస్తుంది. గెలాక్సీ ఎస్‌25 సిరీస్‌ కోసం ప్రీ-ఆర్డర్‌ బుకింగ్‌ అన్ని ప్రముఖ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్‌లలో, సామ్‌సంగ్‌ లైవ్‌లో ప్రారంభమైంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు