Monday, February 3, 2025
Homeఅంతర్జాతీయంఅమెరికాలో తప్పిన భారీ విమాన ప్రమాదంరన్‌వేపై టేకాఫ్‌ అవుతుండగా మంటలు

అమెరికాలో తప్పిన భారీ విమాన ప్రమాదంరన్‌వేపై టేకాఫ్‌ అవుతుండగా మంటలు

వాషింగ్టన్‌: హోస్టన్‌ నుంచి న్యూయార్క్‌ వెళ్లే యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. జార్జిబుష్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం టేకాఫ్‌ అవుతుండగా అకస్మాత్తుగా దాని రెక్కల్లో ఒకదాని నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర తలుపు తెరవగా ఇన్‌ఫ్లేటబుల్‌ స్లైడ్లు తెరచుకున్నాయి. దీంతో ప్రయాణికు లను సురక్షితంగా విమానం నుంచి దించేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎయిర్‌పోర్టులోని అగ్ని మాపక వాహనాలు మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని హోస్టన్‌ అగ్నిమాపక శాఖ వెల్లడిరచింది. విమాన ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మంటలు అంటుకున్నాయని అధికారులు వెల్లడిరచారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 104 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధిం చిన దృశ్యాలను ఓ ప్రయాణికురాలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయ డంతో అవి వైరల్‌గా మారాయి. ఇటీవల అమెరికాలో రెండు విమాన ప్రమాదాలు జరగడంతో ప్రయాణి కులు భయభ్రాంతులకు గురవు తున్నారు. ఈనేపథ్యంలో మరో ప్రమాదం జరగడంతో ఎఫ్‌ఏఏ ప్రమాదాలకు గల కారణాలపై దర్యాప్తును వేగవంతం చేసింది. జనవరి 30న వాషింగ్టన్‌ డీసీలో మిలిటరీ హెలికాప్టర్‌, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఢీకొనడంతో రెండిరట్లో ఉన్న మొత్తం 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫిలడెల్ఫియాలోని ఓ మాల్‌ సమీపంలో మెడికల్‌ ట్రాన్స్‌పోర్టర్‌ విమానం కూలిపోవడంతో ఏడుగురు మరణించగా, 19 మంది గాయపడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు