Homeతెలంగాణసీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

- Advertisement -

ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రశంసలు
సీఎం రేవంత్ రెడ్డి దళిత, బడుగు బలహీన వర్గాల పక్షపాతి

విశాలాంధ్ర,షాద్ నగర్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని షాద్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పేద కుటుంబాలకు సంక్షేమ ఫలాలు అందించడం, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవడం, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత కల్పించడం వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళిత, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు ఆయురారోగ్యాలు, నిండు నూరేళ్ల జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని, ప్రజాసేవలో మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా దీపావళి పండుగ సందర్భంగా షాద్‌నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని, ప్రజల కుటుంబాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వేశ్వర్, విశ్వం, రఘు నాయక్, శ్రీకాంత్ రెడ్డి,చెంది తిరుపతి రెడ్డి, ఎండి ఇబ్రహీం. బాలరాజు గౌడ్, జాంగారి రవి,రవితేజ,సాదిక్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు