- Advertisement -
విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరం రూరల్ పరిధిలో గల చిగిచెర్ల గ్రామపంచాయతీలో జరిగిన ఎంపిటిసి ఎన్నికల్లో టిడిపికి చెందిన చిన్నారపురెడ్డి రత్నమ్మ 930 మెజార్టీతో గెలుపొందడం జరిగిందని ఎంపీడీవో వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారికి డిక్లరేషన్ పత్రాన్ని వారు అందజేశారు. అనంతరం రత్నమ్మ మాట్లాడుతూ నన్ను ఎంపీటీసీగా గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలను తెలుపుతూ, చికిచెర్ల గ్రామపంచాయతీ అభివృద్ధికి తాను అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.


