- Advertisement -
విశాలాంధ్ర – ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు గ్రామపంచాయతీలో జరిగిన ఎంపీటీసీ ఫలితాల్లో ఘన విజయం సాధించడం పట్ల ఆ గ్రామ ప్రజలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తాడిమర్రి శ్రీనివాసులు మాట్లాడుతూ నన్ను ఎంపీటీసీ అభ్యర్థిగా అధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు తాను రుణపడి ఉంటానని, గ్రామ అభివృద్ధికి తాను అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. తదుపరి టిడిపి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు.


