విశాలాంధ్ర – ధర్మవరం;; పట్టణంలోని యశోద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఘనంగా క్రీడా దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కదిరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసానికి క్రమశిక్షణకు న్యాయకత్వ లక్షణాల పెంపుదలకు దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. అనంతరం వివిధ రకాల క్రీడా పోటీలను నిర్వహించగా విజేతలకు బహుమతులను అందజేసి అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ మల్లికార్జున, డైరెక్టర్ పృధ్విరాజ్ ప్రిన్సిపాల్ అనూప్ కుమార్ పాఠశాల ఉపాధ్యాయులు, పీఈటీలు పాల్గొన్నారు.


