కాలువను 10 వేల క్యూసెక్కులకు వెడల్పు చేసి ఆయకట్టుకు నీరు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.. రామకృష్ణ డిమాండ్
విశాలాంధ్ర అనంతపురం : హంద్రీనీవా కాలువను వెడల్పు చేయుకుండా లైనింగ్ పనులు వెంటనే ఆపాలని, కాలువను 10 వేల క్యూసెక్కులకు వెడల్పు చేసి ఆయకట్టుకు నీరు ఇవ్వాలని
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, జలసాధన మంగళవారం హెచ్ ఎల్ సి కాలనీ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి హంద్రీనీవా కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే జాఫర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మాట్లాడుతూ … కాలువను 10 వేల క్యూసెక్కులకు వెడల్పు చేసి ఆయకట్టుకు నీరు
నిత్యము కరువు గురవుతున్న రాయలసీమ జిల్లాలకు త్రాగునీరు, సాగునీరు అందించాలనే ఉద్దేశ్యముతో 1988 సం॥లో క్రిష్ణా జలాలలను రాయలసీమకు ఇవ్వాలని శ్రీశైలం డ్యాం నుండి హంద్రీనీవా పథకం ప్రారంభించారన్నారు. ఈ ప్రాజెక్టు క్రింద రాయలసీమ జిల్లాలో ఆరు లక్షల రెండువేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అందించాలని అందులో నిత్యము వరస కరువులకు గురిఅవుతున్న అనంతపురము జిల్లాలో మూడు లక్షల నలభై ఐదువేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నారు.
ఈ ప్రాజెక్టు 40 టి.ఎం.సి.లను కేటాయించడం జరిగిందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్ మాట్లాడుతూ… ప్రస్తుతము ఈ ప్రాజెక్టులో అనేక కొత్త ప్రతిపాదనలను చేయడం జరిగిందన్నారు. . 40 టి.ఎం.సిల నుండి 65 టి.ఎం.సిలకు పెరిగింది. కాని 40 టి.ఎం.సిలే సక్రమంగా తీసుకోలేని పరిస్థితి వుంది. 12 పంపులు వుంటే ఇప్పుడు 6 పంపుల ద్వారానే నీరు తీసుకుంటున్నారు అని పేర్కొన్నారు. కాలువ సామర్థ్యం తక్కువగా వుండడం వల్ల అధికంగా నీరు తీసుకురాలేకపోతున్నారు.
నిర్దేశించిన ఆయకట్టుకు నీరు ఇవ్వాలంటే ఈ కాలువను 10 వేల క్యూసెక్కులకు పెంచాల్సిన అవసరము ఎంతైనా ఉందన్నారు. . కూటమి ప్రభుత్వము ఈ ప్రాజెక్టు ప్రయోజనాలకు దెబ్బతీసే విధంగా కాలువను వెడల్పు చేయకపోగా రెండవ దశకు లైనింగ్ చేయాలని నిర్ణయించి టెండర్లను పిలవడం జరిగిందన్నారు. లైనింగ్ చేసే ముఖ్యంగా అనంతపురము జిల్లా రైతాంగానికి ఉరితాళ్లు బిగించినట్లే వరస కరువులతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంటలు పండక అప్పుల మీద అప్పులు పెరిగిపోయి ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్న తరుణములో ప్రస్తుతం కాలువలో నీరు ప్రవహిస్తున్నందున జిల్లాలో భూగర్భ జలాలు పెరిగి బోరు బావుల క్రింద పంటలు పండించుకుంటున్నారన్నారు. . ఇప్పుడు ఆయకట్టుకు నీరు ఇవ్వకుండా కేవలం కాలువ నీరు ప్రవహించడానికే ఈ లైనింగ్ వేస్తున్నారన్నారు. ఈ లైనింగ్ వల్ల కాంట్రాక్టర్లకు లాభం జరుగుతుందే తప్ప రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టు అసలు ఉద్దేశ్యమ నెరవేరదని
రాయలసీమలో ముఖ్యంగా అనంతపురము జిల్లా ప్రజలకు ఇబ్బంది కలిగే ఈ లైనింగ్ పనులను తక్షణమే నిలుపుదల చేసి 10 వేల క్యూసెక్కులకు కాలువను వెడల్పు చేసి ఆయకట్టుకు నీరు ఇవ్వాలన్నారు. రాయలసీమ లోని అనంతపురము జిల్లా రైతాంగానికి న్యాయము చేయాలని జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు, రైతు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి పి నారాయణస్వామి, శ్రీ మల్లికార్జున, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్యా, కార్యదర్శి వర్గ సభ్యులు సంజీవప్పా,రాజారెడ్డి, శ్రీరాములు పీట్లరామకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు పద్మావతి, లింగమయ్య, రమణయ్య, నాగార్జున, గోపాల్, సంతోష్ కుమార్,రాజేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చెన్నప్ప యాదవ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హనుమంతు, కుళ్లాయి స్వామి, సమితి సభ్యులు దాడువరి పల్లి రామకృష్ణ, మల్లికార్జున్, వి.కృష్ణుడు, గోపినాథ్ రాము,రాయల్,సీపీఐ నగర సహాయ కార్యదర్శి అల్లిపీర,నగర్ కార్యవర్గ సభ్యులు చాంద్బాషా, మున్, శ్రీనివాస్, కాజా, సిపిఎం నాయకులు రామయ్య, చంద్రశేఖర్, సిపిఎంఎల్ డెమోక్రసీ, కాంగ్రెస్ పార్టీ ఇమామ్, రైతు సంఘాలు, ప్రజా సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు