రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం;; క్యాన్సర్ వ్యాధిని తొలి దశలోనే గుర్తించి సరియైన వైద్య చికిత్సలను పొందాలని రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రపంచ క్యాన్సర్ డే గూర్చి ప్రజలకు పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోనే అంటూ వ్యాధులు పలు రోగాలను నివారించడంలో చికిత్స అందించడంలో ను, మరణాలను అరికట్టవచ్చునని తెలిపారు. క్యాన్సర్ వ్యాధితో ఇటీవల మృతుల సంఖ్య పెరుగుతున్నాయని, కారణం తొలి దశలో గుర్తించలేకపోవడమే మరణముకు కారణమని తెలిపారు. స్త్రీలకు రొమ్ము క్యాన్సర్, గర్భకోశ ముఖ ద్వారం వద్ద ఈ వ్యాధులు వస్తాయని, పురుషులకు ఊపిరితిత్తులు, గొంతు, కడుపు, పేగుల క్యాన్సర్ వస్తుందని తెలిపారు. అంతేకాకుండా పొగాకు ఏ రూపంలోనైనా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. సిగరెట్టు, గుట్కా, పాన్ మసాలా లాంటిది దూరంగా ఉండాలని తెలిపారు. క్యాన్సర్ వ్యాధి అనేది నొప్పి లేకుండా తీవ్రతరం అవుతుందని తెలిపారు. గర్భస్థ ముఖద్వారా క్యాన్సర్ కు వ్యాక్సిన్ ఉందని వారు తెలిపారు. కావున తొలుత బాలికలు యుక్త వయసు రాకమునుపే క్యాన్సర్ కు(గర్భస్థ ముఖ ద్వారా క్యాన్సర్ కు) వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు.
క్యాన్సర్ వ్యాధిని తొలి దశలోనే గుర్తించి చికిత్స పొందాలి
RELATED ARTICLES