మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; స్వయం ఉపాధి సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ, ఈ బీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ, బ్రాహ్మణ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి సబ్సిడీ రుణాలు మంజూరు కావడం జరిగిందని తెలిపారు. పట్టణంలోని సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ల ద్వారా వెబ్సైటు నందు జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. దరఖాస్తుదారుల వయస్సు బీసీ ఈ బీసీ వారికి 21 -60 సంవత్సరాల మధ్య ఉండాలి అని తెలిపారు. బిపిఎల్ కుటుంబాలకు చెందిన వారు అయి ఉండాలని జనరిక్ మెడికల్ షాపులకు దరఖాస్తు చేసుకోవడానికి బి ఫార్మసీ, డి ఫార్మసీ చేసిన వారు అర్హులని తెలిపారు. కుల ధ్రువీకరణ పత్రము, డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ పాస్ బుక్ మొదలగు డాక్యుమెంట్స్ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
స్వయం ఉపాధి సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోండి..
RELATED ARTICLES