Tuesday, February 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిక్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన ర్యాలీ..

క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన ర్యాలీ..

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి.
విశాలాంధ్ర ధర్మవరం;; క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కొరకు తమ ర్యాలీని నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ డెండెంట్ డాక్టర్ మాధవి తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి నుండి పట్టణంలోని పలు వీధులు గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారముగా ఏర్పడి క్యాన్సర్ వ్యాధి నుండి ఎటువంటి వైద్య చికిత్సలు పొందవచ్చును, నివారించవచ్చును అన్న విషయంపై వారు పలు విషయాలను తెలియజేశారు. అనంతరం డాక్టర్ మాధవి మాట్లాడుతూ ప్రజలందరూ కూడా క్యాన్సర్ వ్యాధిపై తప్పక అవగాహన కల్పించుకోవాలని తెలిపారు. మహిళలకు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ,రొమ్ము క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించారు. వీటి నిర్మూలనకై టీకాలు వేయించుకోవాలని తెలిపారు. పొగాకు ఉత్పత్తులు వాడరాదని ప్రాథమిక దశలోనే స్క్రీనింగ్ ద్వారా తెలుసుకొని తగిన వైద్య సేవలు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు నజీర్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సెల్వియా సల్మాన్, యూపీహెచ్ఎస్సి మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ,సూపర్వైజర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు