ప్రధాని నరేంద్ర మోదీ మహాకుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఉదయం ప్రయాగ్ రాజ్ కు చేరుకున్న ప్రధాని.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి త్రివేణి సంగమానికి వెళ్లారు. అరైల్ ఘాట్ నుంచి బోటులో సంగం ఘాట్ కు చేరుకున్నారు. ఆ సమయంలో ప్రధానమంత్రి మహాకుంభమేళా ప్రాంతం గురించి సీఎం యోగి నుంచి సమాచారాన్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత సంగం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ క్రమంలో ప్రధాని మోదీ చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ సంగమంలో స్నానం ఆచరించారు.
ప్రయాగ్ రాజ్ లో ప్రధాని మోదీ.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం..
RELATED ARTICLES