Wednesday, February 5, 2025
Homeజిల్లాలునెల్లూరుప్రతి గ్రామపంచాయతీలలో ఉపాధిహామీ పనులు కల్పించండి

ప్రతి గ్రామపంచాయతీలలో ఉపాధిహామీ పనులు కల్పించండి

పీడీ గంగా భవాని

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : మండలంలోని ప్రతి ఒక్క పంచాయతీలో ఉపాధిహామీ పనులు కూలీలకు పూర్తి స్థాయిలో పనులు కల్పించాలని జిల్లానీటియాజమాన్య సంస్థ పథకసంచాలకులు గంగా భవాని అన్నారు. మంగళవారం మండలంలోని ఉపాధిహామీ కార్యాలయంలో ఉపాధిహామీ సిబ్బందితో సమీక్షాసమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతిలో సిబ్బంది ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించి పూర్తి స్థాయిలో పనులు కల్పించాలని ఆదేశించారు.ప్రతి కూలీకి రోజుకు 300రూపాయలకు తగ్గకుండా వేతనం వచ్చే విధంగా పని కూలీలతో కొలతలు చేయించాలని అన్నారు. అన్ని గ్రామపంచాయతీలలో శ్రమ శక్తి సంఘాలను ఎంపిక పూర్తి చేయాలని అన్నారు ప్రతి గ్రామ పంచాయతీలలో రైతు వారి కుంటలను గుర్తించాలని అన్నారు.కొత్తగా గోకులాల 24మంజూరు అయినాయని పిబ్రవరి 15తేదీ లోపు అన్నీ పూర్తి చేయాలని సిబ్బంది కి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ బాబూరావు, ఏపీఓ ఉమామహేష్, జె ఈ వంశీ కృష్ణ,టీఏలు ప్రసాదు,మాలకొండయ్య, నాగార్జున,అశోక్, చినమాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు