Wednesday, February 5, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఏకాభిప్రాయంతో అధ్యక్ష ఎన్నిక జరపాలని దేవాంగ సోదరులు నిరసన

ఏకాభిప్రాయంతో అధ్యక్ష ఎన్నిక జరపాలని దేవాంగ సోదరులు నిరసన

విశాలాంధ్ర, ఉరవకొండ అనంతపురం జిల్లా

ఉరవకొండ పట్టణంలో ఉన్న దేవాంగ కళ్యాణ మంటపం యొక్క అధ్యక్షున్ని, కుల సోదరులు అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఏకాభిప్రాయంతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవాలని కోరుతూ బుధవారం స్థానిక దేవాంగ కళ్యాణ మండపం వద్ద నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా కొంతమంది కుల పెద్దలు మాట్లాడుతూ గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన చంగలి మహేష్ 2024 సంవత్సరం ఆగస్టు నెలలో పాలకవర్గం రాజీనామా చేస్తున్నట్లు కులస్తుల సమక్షంలో ప్రకటించారని అయితే నూతన అధ్యక్షుని ఎన్నుకునేటప్పుడు దేవాంగుల కుల సోదరులు యొక్క ఎవరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నూతన కమిటీని రిజిస్ట్రేషన్ చేసి మిడుతుల విశ్వనాథుని అధ్యక్షునిగా నియమించినట్లు చెంగలి మహేష్ ప్రకటించడం జరిగిందని. దీనిని కుల సోదరులందరూ తీవ్రంగా వ్యతిరేకించడం జరిగిందన్నారు. బైలా రూలు ప్రకారం అధ్యక్షుడికి కాల పరిమితి మూడు సంవత్సరాల మాత్రమే ఉంటుందని అయితే చెంగలి మహేష్ తన సొంత ఆలోచనలతో 9 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా కొనసాగడమే కాకుండా ఏ రోజు కూడా కళ్యాణ మండపం యొక్క లావాదేవీలు కులస్తులకు తెలుపలేదని సర్వసభ్య సమావేశాలు కూడా ఏర్పాటు చేయకుండా ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. కుల సోదరుల యొక్క మద్దతు లేకుండా ఎన్నికైన మిడుతుల విశ్వనాథ్ అధ్యక్షులు కమిటీని రద్దుచేసి నూతన అధ్యక్షుని కుల సోదరులు, మరియు కుల పెద్దలు యొక్క ఏకాబిప్రాయంతో ఎన్నుకునే వరకు కళ్యాణమంటపంలో ఎలాంటి కార్యకలాపాలు జరపకుండా మూసివేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల సోదరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు