Wednesday, February 5, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయియోగ ఆసనాలు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాయి. యోగా కేంద్ర నిర్వాహకులు

యోగ ఆసనాలు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాయి. యోగా కేంద్ర నిర్వాహకులు

విశాలాంధ్ర ధర్మవరం;; యోగా ఆసనాలు నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయని యోగా కేంద్ర నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పలుచోట్ల రథసప్తమి సందర్భంగా ప్రత్యేకంగా యోగా ప్రదర్శనలను నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ బాలుర పాఠశాలలో వివేకానంద యోగా కేంద్రం ఆధ్వర్యంలో 108 సామూహిక నమస్కారాలను యోగా ఆర్గనైజర్ నరసింహులు గౌరవాధ్యక్షులు గుర్రం వేణుగోపాల్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ యోగాలో 8 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయసు ఉన్న వారు కూడా 108 సామూహిక సూర్య నమస్కారాలను నిర్వహించారు. ప్రతిభ ఘనపరిచిన వారికి మెమొంటోళ్లను బహుమతి ప్రధానం చేశారు.

స్వామి యోగాలయ ఉచిత యోగ శిక్షణ సెంటర్లో కూడా రథసప్తమి వేడుకలు సందర్భంగా యోగా ఆసనాలను యోగ మాస్టర్ చంద్రశేఖర్ భువనేశ్వరులు చెలిమి ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో సూర్య నమస్కార ఆసనాలను దాదాపు 100 మంది యోగా సాధకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం యోగా మాస్టర్స్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పట్టణంలోని నెహ్రూ నగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఉదయము సాయంత్రం యోగ ఆసనాలను నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు.

సేవా భారతి ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్తపేట వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణములో సూర్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు యోగా సాధకులు తిరుమలేష్ ఈశ్వరయ్య సూర్యుని చిత్రపటానికి పూలు వేసి ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం 108 సూర్య నమస్కారాలతో సామూహికంగా నిర్వహించారు. తదుపరి మోడల్ స్కూల్ విద్యార్థి జస్వంత్ చేసిన ఆసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆర్ఎస్ఎస్ విభాగ భౌతిక ప్రముఖ కిషోర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలని తద్వారా చక్కటి ఆరోగ్యంతో పాటు మనశ్శాంతి కూడా లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా భారతి సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు