Wednesday, February 5, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివాహనదారులు సీటు బెల్టు, హెల్మెట్ లతో ప్రయాణం సుఖవంతమవుతుంది

వాహనదారులు సీటు బెల్టు, హెల్మెట్ లతో ప్రయాణం సుఖవంతమవుతుంది

జిల్లా ఎస్పీ రత్న
విశాలాంధ్ర ధర్మవరం;; వాహనదారులు సీటు బెల్టు, హెల్మెట్లతో ప్రయాణం చేస్తే సుఖవంతమైన ప్రయాణం అవుతుందని జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలో జాతీయ రహదారి మాస ఉత్సవాల్లో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ పట్టణంలోని రెండవ పోలీస్ స్టేషన్ వద్ద నుండి రైల్వే ఓవర్ బ్రిడ్జి కళాజ్యోతి సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ గాంధీనగర్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఈ బైకు ర్యాలీలో పట్టణములోని సీఐలు, డి.ఎస్.పి హేమంత్ కుమార్, పోలీస్ స్టేషన్ సిబ్బందిలు కూడా ద్విచక్ర వాహనంలో ర్యాలీగా రావడం జరిగింది. అనంతరం ఎస్పీ రత్న మాట్లాడుతూ సీటు బెల్ట్, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ప్రమాదాలు జరగడంతో పాటు మరణాలు కూడా సంభవిస్తాయని తెలిపారు. అదేవిధంగా డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం సేవించుట సెల్ఫోన్తో డ్రైవింగ్ చేయుట ఎంతో ప్రమాదకరమని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలైనా మైనర్లకు టూవీలర్లు ఇచ్చి, వాహనాలు నడిపించినచో జరిమానా తో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు. ప్రతి వాహనదారులు నియమ నిబంధనలు పాటించి ప్రమాదరహిత ప్రయాణం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి హేమంత్ కుమార్, ట్రేని డిఎస్పీ పావని, వన్టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ 2 టౌన్ సిఐ రెడ్డప్ప, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, ఎస్సైలు, బ్రేక్ ఇన్స్పెక్టర్, తాడిమర్రి ఎస్సై, సచివాలయ మహిళా పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు