విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు. గత అనేక రోజులుగా వివిధ వాణిజ్య షాపుల్లోనూ తాళాలు వేసిన ఇళ్లలో వరసగా బంగారు, వెండి ఆభరణాలతో పాటు డబ్బులు దోచుకుని దర్జాగా దొంగలు తప్పించుకు తిరుగుతున్నారు. తాజాగా మంగళవారం రాత్రి పట్టణంలోని పాత స్టేట్ బ్యాంక్ సమీపంలో ఉన్న జెమిని రామాంజనేయులు అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఉన్న నిండు గ్యాస్ సిలిండర్ ను దాదాపు 8 వేల రూపాయల విలువ చేసే సైకిల్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. వరుస దొంగతనాలు జరుగుతున్నప్పటికీ అరికట్టడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ప్రజల ఆరోపిస్తున్నారు. దొంగలను పట్టుకొని వస్తువులను రికవరీ చేయడంలో కూడా పోలీసులు ఎలాంటి ప్రగతి సాధించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇంటి ఆవరణలో ఉన్న వస్తువులు సైతం దొంగలు వదలడం లేదు దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంటిముందు టూవీలర్లు పెట్టాలన్న ఆవరణలో విలువైన వస్తువులు ఉంచాలన్న ఎవరు ఎప్పుడు వచ్చి దొంగలించకపోతారో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసుల స్పందించాలని దొంగతనాలకు అడ్డుకట్టు వేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఉరవకొండలో రెచ్చిపోతున్న దొంగలు
RELATED ARTICLES